కొవ్వూరు : రాజకీయాలకు అతీతంగా అందరూ కరోనా వ్యాధి నియంత్రణకు సహకరించాలని మంత్రి తానేటి వనిత కోరారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు దుకాణాలతో పాటు మెడికల్ షాపులను సందర్శించిన మంత్రి పలు సూచనలు చేశారు.
షాపుల దగ్గర ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలని యజమానులకు సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని కోరారు. కేవలం భౌతిక దూరంతోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు.