వాషింగ్టన్: కేవలం ఒకేసారి లాక్‌డౌన్ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయి(25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జులుబు మాదిరి కోవిడ్-19 సీజనల్ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు.(ఆ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా!)
కరోనా: 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..